మహారాష్ట్రలో మళ్లీ రాజకీయంలో మార్పులొస్తున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు బీజేపీ పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వారు ఆ పార్టీని వీడాలని అనుకుంటున్నట్టు మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వం వహిస్తున్న శివసేన (యూబీటీ) వర్గం అధికార పత్రిక సామ్నా వెల్లడించింది.
”ఆత్మగౌరవం, మర్యాదను డబ్బుతో కొనుగోలు చేయలేరు. ఇది మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలోని 22 లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని శివసేన సీనియర్ నేత గజానన్ కీర్తికార్ తెలిపారు. దానర్థం వారు ఆ సీట్లను బీజేపీ నుంచి అడిగి ఉంటారని. అయితే ఈ వర్గానికి కనీసం ఐదు నుంచి ఏడు సీట్లు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు” అని సామ్నా పేర్కొంది.