Tuesday, November 26, 2024

ఏపీలో దారుణం.. అనంతపురంలో ఆక్సిజన్ అందక 22 మంది మృతి

అనంతపురం జిల్లాలో వైరస్‌ విశ్వరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు సర్వజనాసుపత్రిలోనే 22 మంది మృత్యువాత పడ్డారు. అందులోనూ శనివారం ఒక్కరోజే 15 మంది మరణించారు. అధికారులు, వైద్యుల నిర్లక్ష్యంతోనే మరణాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రోగులకు ఆశించిన స్థాయిలో ఆక్సిజన్‌ అందడం లేదని వాపోతున్నారు. దీనికి లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్ద ప్రెజర్‌ రెగ్యులేటర్‌ మరమ్మతుకు గురి కావడమే కారణమని తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా చేసే కంపెనీ, ఆసుపత్రి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉన్నా ఫలితం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందినట్లు శనివారం తహసీల్దార్‌ ఖతిజిన్‌ ఖుఫ్రా తెలిపారు. కాగా అనంతపురం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధులతో ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ఇక్కడికి రావడంతో కొందరు మృతి చెందుతున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement