Saturday, November 23, 2024

కూలిన నేపాల్ విమానం నుండి -22మృత‌దేహాలు వెలికితీత‌

ఈ నెల 29న తారా ఎయిర్ లైన్ కి సంబంధించిన నేపాల్ విమానం కూలిపోయింది. ఫొఖారా నుంచి హిమాలయాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జామ్సన్‌కు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. ఫొఖారా నుంచి ఉదయం 10.15 గంటలకు బయలుదేరగా.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఎయిర్‌లైన్‌ ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మనీ వాసులు, 13 మంది నేపాల్‌ పౌరులు, మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది.మరుసటి రోజు పైలట్‌ మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా ట్రాక్‌ చేసి, విమానం కూలిపోయినట్లు నేపాల్‌ ఆర్మీ ధ్రువీకరించింది. ముస్తాంగ్‌ జిల్లాలో విమానం కూలిపోగా.. సోమవారం వరకు 21 మృతదేహాలను వెలికి తీయగా.. మంగళవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు నేపాల్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా ఇద్దరు జర్మనీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement