బీజింగ్: కరోనా మహమ్మారి చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 20,472 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అయితే.. వీటిల్లో ఎక్కువగా లక్షణాలు లేని, అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని అధికారులు తెలిపారు.
అయితే కొత్తగా మరణాలు నమోదు కాలేదని చెప్పారు. షాంఘైలో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదని, షాంఘైలో కరోనా విస్తృతి జాతీయ స్థాయితో పోలిస్తే 80శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..