Saturday, November 23, 2024

మార్చురీలో కుళ్లిపోయిన 200 మృతదేహాలు- హాస్పిటల్‌ విజిట్‌కు వెళ్లిన వారికీ షాక్

మార్చురీలో కుళ్లిపోయిన మృతదేహాలను గుర్తించారు. ఈ దారుణం పాకిస్థాన్‌లో జరిగింది. ముల్తాన్‌లో నిస్తార్‌ హాస్పిటల్‌లో సుమారు 200 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్న ఘటన కలవరం రేపింది. ఆ రాష్ట్ర సీఎం సలహాదారు తారిక్‌ జమాన్‌ గుజ్జార్‌ ఆ మార్చురీకి వెళ్లారు. హాస్పిటల్‌ విజిట్‌కు వెళ్లిన గుజ్జార్‌కు ఓ వ్యక్తి మార్చురీలో పడి ఉన్న మృతదేహాల గురించి ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వెంటనే సీఎం సలహాదారు గుజ్జార్‌ మార్చురీ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూసి ఆయన చలించిపోయారు. మెడికల్‌ స్టూడెంట్స్‌ ఆ మృతదేహాలను పరీక్షల కోసం వాడినట్లు తెలుస్తోంది. ఆడ, మగ మృతదేహాలు మార్చురీతో పాటు మార్చురీ రూఫ్‌పై కూడా పడి ఉన్నాయి. శరీరంపై బట్టలు లేకుండా చెల్లాచెదురుగా ఆ మృతదేహాలు పడి ఉన్న తీరు తీవ్ర ఆందోళన కలిగించింది. ఆ మృతదేహాల గురించి ఆరా తీయగా.. వాటిని మెడికల్‌ స్టూడెంట్స్‌ వాడినట్లు తెలిసింది. రూఫ్‌పై ఉన్న మృతదేహాలకు కూడా బట్టలులేవు. డేగలు, పక్షులు ఆ మృతదేహాలను ఆహారంగా స్వీకరిస్తున్నట్లు తెలిసింది. మెడికల్‌ స్టూడెంట్స్‌ ఆ మృతదేహాలను వాడిన తర్వాత సరైన రీతిలో డీకంపోజ్‌ చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిస్తార్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించింది. మృతదేహాలను వదిలేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement