Sunday, November 17, 2024

Exclusive | నిమ్స్​లో ‘మాస్టర్స్’​ చేయడానికి దరఖాస్తుల ఆహ్వానం.. 20 ఖాళీలు! ​

హైదరాబాద్​లోని ​ నిమ్స్​లో మాస్టర్స్​ ఇన్​ హాస్పిటల్​ మేనేజ్​మెంట్​ కోర్సులో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 19 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులు సక్సెస్​ఫుల్​గా చదువు కంప్లీట్​ చేసుకుని జాబ్​ చేస్తున్నారు. మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (MHM) కోర్సును అందిస్తున్న దేశంలోని వైద్యం, విద్యలో ప్రత్యేకత కలిగిన ఏకైక సంస్థ NIMS. కాగా, వారు ఈ ఏడాది 20 సీట్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది. సీఎం కేసీఆర్​, ఆరోగ్య మంత్రి టి. హరీశ్​ రావు ఆధ్వర్యంలోని కొత్త కొత్త ఫెసిలిటీస్​ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా వైద్య విద్యార్థులకు కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. మాస్టర్స్​ ఇన్​ హాస్పిటాలిటీ మేనేజ్​మెంట్​ (ఎంహెచ్​ఎం) కోర్సులో అర్హులైన అభ్యర్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్‌ను అందించనున్నారు. రీయింబర్స్ మెంట్, టీఎస్‌ఆర్‌టీసీలో ఇతర విద్యార్థుల మాదిరిగానే బస్ పాస్ సౌకర్యాలను కూడా అందిస్తారు.

దీనికి సంబంధించిన వివరాలను కోర్సు అకడమిక్ ఇన్‌చార్జి, డాక్టర్ మార్తా రమేశ్​.. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్ మెంట్ HOD, డాక్టర్ నిమ్మ సత్యనారాయణ వెల్లడించారు. అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసినవారై ఉండాలి. అంతేకాకుండా 2021, డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలన్న రూల్స్​ ఉన్నాయి. ఇక.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

దీనికి గాను ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 5. హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 9. మరింత సమాచారం కోసం, www.nims.edu.in వెబ్‌సైట్‌లో చెక్​ చేయొచ్చు.. లేదా 914023489189కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement