Friday, November 22, 2024

9 రోజుల చికిత్సకి రూ.20 లక్షల బిల్లు.. విరించి హాస్పిటల్ నిర్వాకం!

హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అనారోగ్యంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే, చికిత్సల పేరుతో లక్షలకు లక్షలు బిల్లు వేస్తున్నాయి. రోగి మరణిస్తే బిల్లు కట్టాలని బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన సోదరుడు చనిపోయాదంటూ ఓ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని విరించి ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

శవాలపై కాసులు ఏరుకుంటున్న చందంగా మారింది విరించి హాస్పిటల్ తీరు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి ఓ వ్యక్తి విరించిలో చేరాడు. అయితే, 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు 9 రోజుల చికిత్స కోసం రూ. 20 లక్షల బిల్లు వేశారు. అయితే, పేషంట్ చెల్లి డాక్టర్ కావడంతో హాస్పిటల్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన అన్నకి కేవలం జ్వరం వచ్చిందని హాస్పిటల్ లో చేర్పిస్తే వాడికెందుకు ఒక గ్రాము స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆమె డాక్టర్లను నిలదీశారు. తాను కట్టిన డబ్బు ఎందుకు రిఫండ్ ఇవ్వాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాయి

ఈ క్రమంలో బాధితుడి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ పై మృతుడి బంధువుల దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. బాధితుడి సోదరి కూడా డాక్టర్ కావడంతో బంధువులతో కలిసి ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బందికి, మృతుడి సోదరికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైద్యల నిర్లక్ష్యం కారణంగానే తన అన్న మృతి చెందాడని ఆరోపించింది. చివరికి విరించి హాస్పిటల్ సిబ్బంది దిగివచ్చారు. రూపాయి కూడా కట్టకండి… బాడీ తీసుకెళ్లండి అంటూ విరించి హాస్పిటల్ బేరసారాలకి దిగింది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి మృతుడి సోదరి పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement