Tuesday, November 26, 2024

గ్రామ సింహాలు స్వైర విహారం.. ఇద్దరి పరిస్థితి విషమం

గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాన్ని రక్షించే గ్రామ సింహాలే ఇప్పుడు ప్రజల పాలిట మృత్యు సింహాలుగా మారుతున్నాయి. విశ్వాసానికి కేరాఫ్‌గా అడ్రస్‌గా నిలిచే కుక్కలు ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. అనంతగిరి  మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

వడ్డే సాయి అనే చిన్నారి తన తాతతో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లగా పొలం గట్టుపై కూర్చొని ఉన్న సాయిపై ఒక్కసారిగా పిచ్చి కుక్క దాడి చేసి రెండు చేతులను తీవ్రంగా గాయపరిచింది. అంతేకాక గ్రామ శివారులో తన పొలంలో నిద్రపోతున్న గోపతి సత్యం అనే రైతును సైతం విసక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పెదవులను కొరికి పడవేసింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పిచ్చి కుక్కల బెడద ఉందని సర్పంచ్ కార్యదర్శికి ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించక పోవడం వల్లే ఇప్పుడిలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పిచ్చి కుక్కల బెడద ఎక్కువై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement