హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినొళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు వస్తాయని, ఫైరవీలు చేసుకుంటే పోటీ చేసే అవకాశం రాదని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో అధికారంలోకి వస్తుందని, గోల్కొండ కోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పార్టీ కేడర్‌కు ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే మెదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాంమని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ కోసం అవసరమైతే సోనియాగాంధీ కాళ్లు పట్టుకుంటానని, ప్రగతి భవన్‌ను అంబేద్కర్ భవన్‌గా మారుస్తూ మొదటి సంతకం పెడతామని ఆయన పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్‌లో నిరుద్యోగ సమస్యలపై దీక్ష చేపట్టగా.. సాయంత్రం రేవంత్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను ముగించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నినాదాన్ని ముందుగా కాంగ్రెస్ పార్టీనే తీసుకొచ్చిందని, మాజీ మంత్రి చిన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోనియాగాంధీకి లేఖ రాశారని ఆయన తెలిపారు. ఇప్పుడు మధ్యలో వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు తెలంగాణకు తామే ఓనర్లమని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. యువకుల జీవితాలతో కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ నిరుద్యోగుల హక్కులను ఆనాడు ఇందిరాగాంధీ కాపాడారని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 1 లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. అసెంబ్లిd సాక్షిగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కేసీఆర్ ఇచ్చిన హామీ 8 ఏళ్లు పూర్తయినా ఎందుకు నెరవేరలేదన్నారు.
ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు రావాలి..?
సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి యుద్ధానికి రావాలని, తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌కు పాలన చేయడం, యుద్ధం చేతకాకనే ప్రశాంత్ కిషోర్‌ను అరువుకు తెచ్చుకున్నాడని ఆయన విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లి పోటీ చేసి గెలవాలని టీఆర్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి పై విధంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఇప్పటి వరకు ఎందుకు ఎత్తివేయలేదని ఆయన ప్రశ్నించారు. హరీష్‌రావుకు నీకు, నీ పార్టీకి ఉద్యోగాలు వచ్చాయి, కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే కేసీఆర్‌కు గుండెలో గునపం గుచ్చేవాడినని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ శాంతియుత వాతావరణం వస్తుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయన్నారు. సోనిగాంధీ నిర్ణయించిన వాళ్లే అసెంబ్లిd, పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థులుగా వస్తారన్నారు. రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు వైన్స్‌షాపులల్లో పని చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన్‌రెడ్డి విమర్శించారు. యూత్ కాంగ్రెస్‌ను అణిచివేయాలని చూస్తోందన్నారు.