అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. న్యూయార్క్ లోని బ్రాంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 19 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారు. 19 అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లో రెండు, మూడు ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా ఇతర అంతస్తులకు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్ మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ఇంటి కిటికీలను పగలగొట్టి ప్రాణాలతో బయట పట్టారు.
ఈ ప్రమాదంలో 60 మందికిపైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. క్షతగాత్రుల్లో చాలా మంది పొగ పీల్చడం వల్లే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. కాగా, 30 ఏళ్ల తర్వాత న్యూయార్క్ నగరంలో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదం ఇదే అని అధికారులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital