19మంది అస్సాం కార్మికులు మిస్సయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ లోని కురుంగ్ కుమే జిల్లాలో 19మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు కావడం కలకలం రేపుతోంది. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోయారు. రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ కార్మికులకు లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.వారిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.
19మంది అస్సాం కార్మికులు మిస్సింగ్ – పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిన కాంట్రాక్టర్
Advertisement
తాజా వార్తలు
Advertisement