ఇంటర్ చదువుతోన్న విద్యార్థుల్లో 18సంవత్సరాలు నిండిన వారందరికి కోవిడ్ వ్యాక్సిన్లు వేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.తెలంగాణలో ఇప్పటికే పలు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కరోనా భయంతో ఇళ్లకు పంపిస్తున్నారు. ఇదే కొనసాగితే ఇంటర్ విద్యార్థుల చదువులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండినవారు 55,250 మంది ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వీరందరికి త్వరలో వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement