కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మరింత స్పీడ్‌గా వ్యాప్తి చెందుతున్న వార్తలే ఇందుకు కారణం. అయితే దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్ నెమ్మదిగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. బ్రిటన్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ సహా మరికొన్ని దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తోంది. దీంతో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలైతే విదేశీ రాకపోకలను నిషేధించాయి. మరొకొన్ని దేశాలు పలు ఆంక్షలు విధించాయి. డిసెంబర్ 15 నుంచి విదేశీ విమానాలను అనుమతిస్తామని ప్రకటించిన ఇండియా కూడా నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. అంతేకాకుండా పలు ఆంక్షలు కూడా విధించి, మరింత అప్రమత్తం అయ్యింది.
అయితే.. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో భయం నెలకొంది. సౌథాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు మూడు రోజుల్లో 185 మంది ప్రయాణికులు వచ్చారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో దిగారు. ఒమిక్రాన్ వేరియంట్‌తో వణికిపోతున్న బోట్స్‌వానా నుంచి 16 మంది వచ్చారు. దీంతో చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా కరోనా కొత్త వేరియెంట్ కేసులున్న 12 దేశాల నుంచి వచ్చిన వారు కూడా ఇందులో ఉన్నారు. హైదరాబాద్‌కు వచ్చిన వారందరికీ ప్రత్యేక వైద్య బృందాలు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేశాయి. ఇందులో ఇప్పటికైతే 11 మందికి పాజిటివ్ అని తేలడంతో మరింత భయాందోళన నెలకొంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..