భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చేశాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్యం 173కు చేరింది. గడిచిన 24 గంటల్లో 11 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 6, గుజరాత్ 1, కేరళలో 4 చొప్పున మొత్తం 11 కేసులు వెలుగు చూశాయి. భారత్ లో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో 28, తెలంగాణలో 20, కర్నాటకలో 19, గుజరాత్‌లో 14, రాజస్థాన్‌లో 17, కేరళలో 15, యూపీలో 2, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గడ్, బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదైంది.
డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్ కేసులపై ప్రత్యేకంగా దృషి పెట్టాయి. మరోవైపు దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది.