కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ 17 ఏళ్ల బాలికపై తెలిసిన అబ్బాయిలు కొందరు సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని ఇవ్వాల (శనివారం) పోలీసులు ధ్రువీకరించారు. అయితే.. నిందితులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు బయటరాయణపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే.. నిందితుల కోసం గాలింపు చేపట్టామని, వీరిలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఆ బాలిక రెండేళ్లుగా నిందితుడికి తెలుసు అని, ఆ బాలిక ప్రైవేట్ ఫొటోలు తీసుకుని బెదిరింపులకు పాల్పడి రేప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.