వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజ్‌పై కరోనా పంజా విసిరింది. రెండు రోజుల వ్యవధిలోనే 17మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. కళాశాలలో వివిధ విభాగాల సిబ్బంది, అన్ని కోర్సుల విద్యార్థులతో కలుపుకుని దాదాపు 2వేల మందికి పైగా కళాశాలలో ఉంటారు. ప్రస్తుతం అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పాజిటివ్ కేసులు మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ ఫెస్టివల్స్ తర్వాత కళాశాలలకు చేరుకున్న విద్యార్థుల్లో కరోనా లక్షణాలు బయటపడినట్లుగా తెలుస్తోంది. రెండు రోజులుగా కళాశాలలో లక్షణాలు కలిగిన వారందరికి పరీక్షలు నిర్వహిస్తుండటంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital