Tuesday, November 26, 2024

హైద‌రాబాద్‌కు 160 ఏండ్ల నాటి స్విస్ రే కంపెనీ.. ఈ ఆగ‌స్టులోనే కార్య‌క‌లాపాలు

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జ‌ర్లాండ్‌కు వెళ్లిన మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను కేటీఆర్ వివ‌రిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప‌లు కంపెనీలు ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో 160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సంద‌ర్భంగా ఆ కంపెనీ ప్ర‌తినిధులు కేటీఆర్‌తో స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. స్విట్జ‌ర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్ర‌పంచంలోని 80ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తోంది.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల‌కు హైద‌రాబాద్ కేంద్రంగా నిలిచిందని ప్ర‌క‌టించ‌డానికి సంతోషిస్తున్నాన‌ని పేర్కొన్నారు. స్విస్ రే కంపెనీకి ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నామ‌ని తెలిపారు. ఈ ఆగ‌స్టులో హైద‌రాబాద్‌లో స్విస్ రే కంపెనీ త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నుంద‌ని చెప్పారు. హైద‌రాబాద్‌లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుంద‌ని. డాటా, డిజిట‌ల్ కెప‌బిలిటీస్, ప్రొడ‌క్ట్ మోడ‌లింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించ‌నుంది. ఈ సంద‌ర్భంగా స్విస్ రే కంపెనీ ప్ర‌తినిధుల‌కు కేటీఆర్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement