యాదాద్రి: కుల వృత్తిని మరచిపోతున్న రోజుల్లో తన కుల వృత్తిని గౌరవిస్తూ పదవ తరగతి పదహారేళ్ల వయసులో గీత కార్మికుడిగా మారాడు. ఒకవైపు చదువుతోపాటు, తాతకు ఆసరాగా గీత వృత్తిని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువకుడు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన కల్లూరి నగేష్- రేణుకల కుమారుడు శివ గౌడ్ పదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి నగేష్ ఆటోడ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. తన తాత కల్లుగీత కార్మికుడు చిన్ననాటి నుండే తన తాత దగ్గర పెరగడంతో తాత కష్టాన్ని చూసి ఒకవైపు చదువుతోపాటు కులవృత్తిని ఎంచుకొని తాత కు ఆసరాగా నిలుస్తున్నాడు.
తాతల తరం నుంచి కళ్ళు గీస్తున్న గీత వృత్తి దారులు తగ్గిపోతున్నారు అని శివ గౌడ్ అన్నాడు. కుల వృత్తిని గౌరవించి మన వృత్తి మనం చేసుకోవాలని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా కులవృత్తులను కాపాడుకోవాలని, ఔషధ గుణాలు కలిగిన తాటికల్లు ఆరోగ్యానికి మేలన్నారు. తాత కు ఆసరాగా నిలుస్తూ పై చదువుల కోసం కష్టపడతానని ఘంటా పథంగా చెప్పాడు.