అమెరికాలోని న్యూయార్క్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లోని బ్రాన్స్క్ హైస్కూల్ బయట బయట ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో స్కూల్ నుంచి బయటకు వస్తున్న 16 ఏళ్ల విద్యార్థిని మృతిచెందింది. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయడపిన వారిని ఆస్పత్రికి తరలించారు. దుండగుడు పరారీలో ఉన్నాడు. అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement