Tuesday, November 26, 2024

ప్రభుత్వ స్కూళ్లలో కరోనా విజృంభణ.. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 156 కేసులు

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే పలు పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒకే రోజు అత్యధికంగా 20 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో నలుగురు ఉపాధ్యాయులు, 16 మంది విద్యార్థులు ఉన్నారు. మద్దిపాడు మండలం నేలటూరు యంపీయూపీ స్కూల్‌లో నలుగురికి పాజిటివ్ రాగా.. ఉలవపాడు మండలం వీరేపల్లి మోడల్ స్కూలులో నలుగురికి కరోనా సోకింది.

అలాగే కొండపి మండలం పెట్లూరు జెడ్పీ హైస్కూలులో ముగ్గురికి సోకగా.. పొన్నలూరు మండలం పి.అగ్రహారం ఎంపీ స్కూల్ లో నలుగురికి, విప్పగుంట ఎంపీపీఎస్‌లో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కనిగిరి మొదటి వార్డు ఎంపీ స్కూలులో ఇద్దరికి, నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం ఎంపీ స్కూల్, హెచ్.నిడమానూరు ఎయిడెడ్ స్కూలులో ఒకరికి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో పలువురు టీచర్లు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement