Tuesday, November 26, 2024

కోతి అంత్యక్రియల్లో 1500 మంది.. రూల్స్ బ్రేక్ చేశారని ఇద్దరిపై కొవిడ్ కేసు..

మనం కోతులను అంజన్న స్వరూపంగా భావిస్తుంటాం. చాలామంది కోతులను కొట్టడం వంటివి చేయరు. అయితే మధ్యప్రదేశ్ లో ఒక కోతి చనిపోతే మానవత్వం చాటుకున్నారు ఆ గ్రామస్తులు. కాగా, పది ఇరవై మంది కాకుండా కోతి అంత్యక్రియల్లో 1500 మంది పాల్గొనడంతో వివాదంగా మారింది. దీంతో కొవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు.

డిసెంబర్ 29న కోతి చనిపోవడంతో బాధపడ్డ రాజ్‌గఢ్ జిల్లాలోని దలుపురా గ్రామ వాసులు అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాల కోసం ప్రజలంతా కలిసి పాడెను మోస్తూ శ్లోకాలు పఠిస్తూ అంత్యక్రియల ఊరేగింపు నిర్వహించారు. హరి సింగ్ అనే యువకుడు హిందూ ఆచారాలకు అనుగుణంగా గుండు చేయించుకుని సంప్రదాయకంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. కోతి తమ పెంపుడు జంతువు కాకున్నా.. అది తరచూ గ్రామానికి వచ్చేదని, అందుకనే ఊరిజనం అంతా కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నట్టు దలుపురా గ్రామస్తులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement