Saturday, November 23, 2024

టోక్యోలో 150ఏళ్ల రికార్డ్ బ్రేక్ – దంచికొడుతున్న ఎండ‌లు

టోక్యోలో దాదాపు 150ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయింది. ఈ మేర‌కు జ‌పాన్ లో ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు అధిక స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. వ‌రుస‌గా నాలుగ‌వ రోజు అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు అయ్యాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా జూన్ నెల‌లో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయిన‌ట్లు తెలిపారు. దీంతో విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డుతోంది. టోక్యోలో అత్య‌ధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు అయ్యింది. వ‌రుస‌గా మూడు రోజుల నుంచి ఇదే స్థాయిలో టెంప‌రేజ‌ర్లు న‌మోదు అవుతున్నాయి. 1875 త‌ర్వాత జూన్‌లో ఈ స్థాయిలో ఉష్ణోగ్ర‌త న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి అని అధికారులు చెప్పారు. వ‌డ‌దెబ్బ త‌గిలిన కేసులో న‌గ‌రంలో ఎక్కువ‌య్యాయి. హాస్పిట‌ళ్ల‌కు ఆ కేసుల సంఖ్య పెరిగిన‌ట్లు తెలుస్తోంది. విద్యుత్తును మితంగా వాడుకోవాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement