Maharashtra political crisis LIVE: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు శివసేన వెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తమతో టచ్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలున్నారని సేన లీడర్, సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరే ఇవ్వాల (మంగళవారం) ఉదయం చెప్పారు. కాగా, మహారాష్ట్ర సీఎంఉద్ధవ్ థాకరే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారు.
దీనిలో మొదటి చర్యగా 9 మందిమంత్రుల శాఖలను తొలగించి ఇతరులకు వాటిని కేటాయించారు. శాఖులు కోల్పోయిన వారంతా తిరుగుబాటు దారు ఏక్‌నాథ్ షిండేతో కలిసి గౌహతిలో ఉన్నారు. ఇక.. తిరుగుబాటు మంత్రుల శాఖలను పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర మంత్రులకు అప్పగించినట్లు అధికారిక ప్రకటనలో సీఎం వెల్లడించారు.
ఇదిలావుండగా.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ కు మద్దతు తెలుపుతూ శివసేన నేతలు నిన్న ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సమావేశాలను నిర్వహించారు. వైజాపూర్, ఔరంగాబాద్ వెస్ట్, ఔరంగాబాద్ సెంట్రల్ స్థానాల్లో రమేష్ బోర్నారే, సంజయ్ షిర్సత్, ప్రదీప్ జైస్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సేన నాయకులు చంద్రకాంత్ ఖైరే, వినోద్ ఘోసల్కర్, ఎమ్మెల్సీ అంబాదాస్ దాన్వే పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సందీపన్ బుమ్రే (పైథాన్), అబ్దుల్ సత్తార్ (సిల్లోడ్) అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహా సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వారు తెలిపారు.