Tuesday, November 26, 2024

Breaking:148రోజులు-12రాష్ట్రాలు-203నియోజ‌క‌వ‌ర్గాల్లో – రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌

అక్టోబ‌ర్ 2నుండి భార‌త్ జోడో పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర‌కి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. 148 రోజుల పాటు 12 రాష్ట్రాల్లోని 203 నియోజకవర్గాలలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 3,600 కిలోమీటర్ల మీర రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ యాత్ర ప్రారంభమై.. కాశ్మీర్‌లో ముగియనుంది. రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఆయన యూరప్‌‌కు వెళ్లారని.. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని సమాచారం. అయితే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పార్లమెంట్ వర్షకాల సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన తిరిగి స్వదేశానికి చేరుకుంటారట‌.

ఆదివారం ఆయన ఇండియాకు చేరుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఆయన నాయకత్వ నిబద్దతపై అనే ప్రశ్నలకు తావిస్తోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒక చోట కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు సందర్భాల్లో రాహుల్ విదేశీ పర్యటనలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా గోవా కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement