Saturday, November 23, 2024

సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా… 145 రైళ్లు ర‌ద్దు ..

భారతీయ రైల్వే శాఖ ఈరోజు ప‌లు రాష్ట్రాల్లో రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. దేశ‌వ్యాప్తంగా ఈరోజు 145 రైళ్లను రద్దు చేసింది. మరో 21 రైళ్లు ప్రారంభమయ్యే స్టేషన్లను మార్చింది. వీటితో పాటు 15 రైళ్లను ఐఆర్సీటీసీ పాక్షికంగా రద్దు చేసింది. ట్రైన్ మెయింటెనెన్స్, ఆపరేషన్స్లో సమస్య తలెత్తిన కారణంగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే శాఖ బుధవారం సైతం 131 ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దు చేసిన రైళ్లలో ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, బెంగాల్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బీహర్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల మధ్య నడిచేవి ఉన్నాయి. రైళ్ల ర‌ద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement