ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంకీపాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చనిపోయారు. ఇప్పటివరకు 70దేశాలకు మంకీపాక్స్ కేసులు పాకాయి. మంకీపాక్స్ కేసుల పెరుగుదలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది. మొన్నటి వరకు కరోనా కేసులు ప్రజలను భయపెట్టగా… ఇప్పుడు మంకీపాక్స్ కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ కోరుతోంది.