ఇటలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆల్ప్స్ పర్వతాలు వీక్షించేందుకు పర్యటకులు కేబుల్ కారు ఎక్కి ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా కేబుల్ కారు కుప్పకూలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు ఇజ్రాయెల్ దేశస్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో మూసివేసిన ఈ కేబుల్ కారును ఇటీవల పునఃప్రారంభించారు.
మాగియోర్ సరస్సు అందాలను ఎత్తైన ప్రదేశం నుంచి చూసేందుకు వీలుగా పక్కనే ఉన్న మొటారోన్ పర్వతం పైకి కేబుల్ కారు మార్గాన్ని ఏర్పాటు చేశారు. మరో 100 మీటర్లు వెళితే పర్వత శిఖరంపై దిగుతారనగా ఒక్కసారిగా కేబుల్ తెగిపోయింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి మారియో ద్రాగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాడ సంతాపం తెలిపారు.