పదో తరగతి పరీక్షా ప్రశ్న పత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఏ1 నిందితుడిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో హన్మకొండ సేషన్స్ కోర్టు ఇవ్వాల (బుధవారం) రిమాండ్ విధించింది. కాగా, వరంగల్ పోలీసులు ప్రశ్నాపత్రాల కేసులో కాన్స్పిరసీ (కుట్ర) ఉందని, అతని నుంచి మరిన్ని ఆధారాలు సేకరించాలని కోర్టుకు తెలిపారు. తమ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి పోలీసుల కస్టడీకి అనుమతిచ్చారు.
ఇక.. బండికి బెయిల్ కోసం బీజేపీ లీగల్ సెల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. హన్మకొండ అదాలత్ దగ్గర పెద్ద ఎత్తున అడ్వొకేట్స్ గుమిగూడి చర్చించుకుంటున్నారు. బండి సంజయ్ రిమాండ్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుమిగూడిని బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా పంపించారు.