Saturday, November 23, 2024

Covid-19: దేశంలో భారీగా పెరిగిన కరోనా.. ఒక్క రోజే 13 వేల పాజిటివ్ కేసులు

భారత్ లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా పది వేలలోపు కేసులు నమోదు కాగా.. నేడు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,154 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 268 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,80,860కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7486 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ప్రస్తుతం దేశంలో 82,402 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,48,22,040కి చేరగా.. ఇందులో 3,42,58,778 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 63,91,282 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,83,22,742కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాక తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement