Friday, November 22, 2024

Big Story: 113 ఏళ్ల నాటి మర్డర్, ఫేమస్ టీవీ సీరియల్.. మిస్టరీ వీడింది, కిల్లర్స్ ఎవరంటే..

1990లలో టీవీలో వారం వారం వచ్చిన ఆ క్రైమ్ షో అంటే అంతా ఇంట్రెస్ట్ చూపేవాళ్లు. అత్యంత ప్రజాదరణ పొందిన అట్లాంటి థ్రిల్లింగ్ స్టోరీకి నిజంగా ఓ మర్డర్ కేసు ఇన్పిరేషన్ అంటే నమ్ముతారా.. అవును.. ఆ మిస్టరీ మర్డర్ కేసుకు ఈ మధ్యనే పరిష్కారం దొరికింది. ఆ ‘‘ట్విన్ పీక్స్’’ టీవీ షోకు సంబంధించి తమ ఐదేళ్ల పరిశోధన తర్వాత 113 ఏళ్ల నాటి కోల్డ్ మర్డర్ కేస్‌ను పరిష్కరించినట్టు పేర్కొన్నారు అమెరికా నేర పరిశోధకులు.

డేవిడ్ బుష్మాన్, మార్క్ గివెన్స్ అనే ఇద్దరు నేర పరిశోధకులు థామస్ & మెర్సర్ అనే మారుపేర్లతో చాలా ఫేమస్ అయ్యారు. ట్విన్ పీక్ పాత్ర లారా పాల్మెర్‌ను ఇన్ స్పైర్ చేసిన 20 ఏళ్ల హాజెల్ డ్రూ మర్డర్ పై వీరిద్దరూ ఐదేళ్లుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు. కాగా, ఈ కేసులో హతురాలు హాజెల్ డ్రూ 1908వ సంవత్సరం, జులై7న చనిపోయింది. న్యూయార్క్ లో ఉన్న ట్రాయ్ ఏరియాలోని టీల్స్ పాండ్ లో ఆమె పుర్రె మాత్రమే దొరికింది. అదికూడా ముఖం భూమివైపు పెట్టి క్రష్ చేసినట్టు ఉంది.

ఈ మర్డర్ కేసుకు సంబంధించి హంతకులు ఎవరనేది తెలియలేదు. అసలు ఆమె ఎలా చనిపోయిందన్నది కూడా మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసు విచారణ జరిపిన జిల్లా న్యాయవాది ఆమె కుటుంబ సభ్యులతోపాటు తెలిసిన వారిని, ఆమె లవర్స్ ని, సీక్రెట్ లవర్స్ ని విచారణ జరిపారు. అయితే ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులున్నా వారి నుంచి ఎట్లాంటి సమాచారం రాబట్టలేకపోయారు. దీంతో ఆ మర్డర్ అలా మిస్టరీ కేసుగానే మిగిలిపోయింది.

అట్లా చాలా కాలంగా ఆ కేసు ముందుకు సాగకుండా ఫైళ్లపై దుమ్ము పేరుకుపోతే.. ఈ మర్డర్ కు సంబంధించిన అమెరికాలో ఓ క్రైం అండ్ థ్రిల్లర్ స్టోరీ టీవీ షోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిస్టీరియస్, హర్రర్, డ్రామా సీరియల్ గా ఆకట్టుకోవడంతో జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. స్క్రీన్ రైటర్స్ డేవిడ్ లించ్, మార్క్ ఫ్రాస్ట్ దీన్ని ఓ దెయ్యం కథగా మలిచి ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. అయితే ఇది వారి నానమ్మ చెప్పిన దెయ్యం కథల్లో ఒకటని, ఆ ఏరియాలో దెయ్యం వెంటాడే విధానాన్ని వాళ్లు చెప్పుకొచ్చారు.  1990లో తొలిసారిగా ప్రసారమైన కల్ట్ హిట్ క్రైమ్ డ్రామాలో నటి షెరిల్ లీ పోషించిన లారా పాల్మెర్, హాజెల్ డ్రూ పాత్రలు ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి.

ఆ టీవీ షోలో లారా పాల్మెర్, హాజెల్ డ్రూ ఇద్దరూ కూడా చిన్న చిన్న టౌన్స్ లో ఉండే బ్యూటీఫుల్ గర్ల్స్.. అయితే వీరు మర్డర్ కి గురవుతారు. వీరిద్దరి హత్యలు ఆ ప్రాంతంలో చాలా సెన్సేషన్ అవుతాయి. కాగా, దీనిలో అవినీతి పరులు, సీక్రెట్ లవర్స్ వికృత చేష్టలను ఈ పాత్రల ద్వారా రచయితలు బహిర్గతం చేస్తారు. అయితే.. ట్విన్ పీక్స్ షోలో ఒకరిని ఎవరు చంపారు అనేది బయటికి తెలుస్తుంది. కానీ, డ్రూ కిల్లర్ ఎవరనేది మాత్రం రివీల్ కాదు. అప్పటి నుంచి అది అలాగే సస్పెన్స్ గా ఉంటుంది.

- Advertisement -

అయితే.. దీనికి సంబంధించి ఈ మధ్యనే నేర పరిశోధకులు ఓ సంచలానాత్మకమైన విషయాన్ని బయటపెట్టారు. ఇదొక ఎక్స్ ప్లోజివ్ వంటిదని పేర్కొన్నారు. స్థానిక రిపబ్లికన్ పార్టీలోని ప్రముఖ వ్యక్తి ఫ్రెడ్ స్కాట్జిల్, విలియం కుషింగ్, అతని ఫ్రెండ్ ఈ హత్య చేసినట్టు కనుగొన్నారు. వారికి సంబంధించిన కొన్ని ఆధారాలు, రహస్య విషయాలు, సెక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ మర్డర్ కి కారణంగా తెలిపారు. అంతేకాకుండా పార్టీకి సంబంధించిన చాలా కుంభకోణాల వివరాలు హాజెల్ డ్రూకు తెలియడం వల్లే ఆమెను దారుణంగా చంపేశారని డిటెక్టివ్ లు కనుగొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement