తెలంగాణ రాష్ట్రంలో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నుంచి ఇవ్వాల (సోమవారం) రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో ఉంది. కాగా, కొత్త మండలాల్లో జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం రెవెన్యూ మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్, మహబూబ్‌నగర్ జిల్లాలో సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలో అక్బర్పేట్, భూంపల్లి, కుకునూర్‌పల్లి ఉన్నాయి.
ఇక.. కామారెడ్డి జిల్లాలో డోంగ్లి, మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల, నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్, సాలూరాలను మండలాలుగా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయా మండలాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.