Sunday, November 10, 2024

ఏపీలో ఎయిర్‌పోర్టుల లెక్క ఇదీ..

కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం నాడు సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ ఎయిర్‌పోర్టు అని కూడా నామకరణం చేశారు. దీంతో ఏపీలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 10కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలలో 10 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇందులో మూడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉండటం విశేషం. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రేణిగుంట సమీపంలోని తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, విజయవాడ సమీపంలోని గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్నాయి.

అటు మూడు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. కడప ఎయిర్‌పోర్టు, కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు ఉన్నాయి. అటు అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి ఎయిర్‌పోర్టు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉంది. మరోవైపు విజయనగరం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టు, చిత్తూరు జిల్లాలో కుప్పం ఎయిర్‌పోర్టు, నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్‌పోర్టు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రకాశం జిల్లాలో దొనకొండ ఎయిర్‌పోర్టు ఉన్నా ప్రస్తుతం సర్వీసులేవీ నడవడం లేదు. కాబట్టి ఇది లెక్కలోకి రాదు.

ఏపీలోని 13 జిల్లాలలో ఎయిర్‌పోర్టు లేని జిల్లాలు మూడే ఉన్నాయి. అవి గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లా మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement