Thursday, November 21, 2024

The Real Hero | సంబురంగా అల్లూరి సీతారామారాజు 125 జయంతి

ప్రజలమీద పీడన, దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో దైవాంశ సంభూతులు పుడతారని ‘‘సంభవావి యుగే యుగే ’’ అని గీతాచార్యుడు చెప్పిన మాటలు, 26 ఏండ్ల అతిపిన్న వయస్సులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి అమరుడైన అల్లూరి సీతారామరాజు జీవితానికి నిజంగా వర్తిస్తాయని సీఎం కేసీఆర్​ అన్నారు. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ స్వయం పాలన కోసం సాగిన స్వాతంత్ర్య  పోరాటంలో అల్లూరి గొప్ప  స్పూర్తిని రగిలించారని అన్నారు. అల్లూరి స్పూర్తిని తెలిపే గీతాలను వింటూ తాను తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎంతో స్పూర్తిని పొందానని అన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో పోరాడి అసువులు బాసిన భగత్ సింగ్ వంటి గొప్ప వీరుల సరసన తెలుగునేల మీదనుంచి అల్లూరి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని కేసీఆర్​ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల నిర్వాహకులయిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులను సీఎం కేసీఆర్ వేడుకల ముగింపు సందర్భంగా అభినందించారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

Advertisement

తాజా వార్తలు

Advertisement