నేటి కాలంలో 30ఏళ్లు దాటితే చాలు షుగర్లు, బీపీలు వచ్చి పడుతున్నాయి. ఇన్నేళ్లు బతుకుతామని ఖచ్చితంగా చెప్పలేం. అయితే 125ఏళ్ల యోగా గురువు ఏకంగా సాష్టాంగ నమస్కారం చేసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. 125 ఏళ్ల స్వామి శివానందకి రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ లో అతిథులు నించుని చప్పట్లతో తమ గౌరవాన్ని చాటారు. కానీ దీని కంటే ముందే స్వామి శివానంద తన వినయాన్ని చాటుకున్నారు. అంత పెద్ద వయసులో ఉండి కూడా పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకోవడానికి ముందు ప్రధాని నరేంద్రమోడీకి సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రధాని మోడీ సైతం కుర్చీ నుంచి లేచి రెండు చేతులు నేలపై ఆనించి ప్రతి నమస్కారం తెలియజేశారు. అనంతరం స్వామి శివానంద రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉన్న వైపు వెళ్లి ఆయనకు సైతం సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో రాష్ట్రపతి స్వయంగా వచ్చి స్వామిని పైకి లేవదీశారు. అనంతరం అవార్డును ఇచ్చి సత్కరించారు. హృదయాన్ని హత్తుకుంటోంది. కాశీకి చెందిన 125 ఏళ్ల యోగా గురు, స్వామి శివానంద యోగా రంగంలో చేసిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు’’అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement