Saturday, November 23, 2024

Breaking : ఇట‌లీ నుంచి వ‌చ్చిన 125మంది ప్ర‌యాణికుల‌కు ‘క‌రోనా’

అమృత్ స‌ర్ లో ఇట‌లీ నుంచి వ‌చ్చిన చార్ట‌ర్డ్ ఫ్లైట్ లో 125మంది ప్ర‌యాణికుల‌కు పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. మిల‌న్ నుండి మ‌ధ్యాహ్నం 1.30గంట‌ల‌కు అమృత్ స‌ర్ కు వ‌చ్చిన చార్ట‌ర్డ్ విమానంలో 19మంది పిల్ల‌ల‌తో స‌హా 179మంది ప్ర‌యాణికులు ఉన్నారు. కాగా విమానం టిబిలిసి (జార్జియా)వ‌ద్ద సాంకేతికంగా నిలిచిపోయింది. దీనిని పోర్చుగీస్ కంపెనీ యూరో అట్లాంటిక్ ఎయిర్ వేస్ నిర్వ‌హిస్తుంది. ఒమిక్రాన్ ఎక్కువ ప్ర‌మాదం ఉన్న దేశాల‌లో ఇట‌లీ కూడా ఒక‌టి. దాంతో అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. 125 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో వీరందరినీ ఐసొలేషన్ లో ఉంచారు.

ఇదే సమయంలో వీరందరి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు. వీరిలో ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం జీనోమ్ సీక్వెన్సింగ్ లో తేలనుంది. రిస్క్, రిస్క్ ఎట్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ..కోవిడ్‌ పాజిటివ్‌గా ఉన్న ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌కు పంపుతారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ అమాంతం పెరుగుతున్నాయి. దీంతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా బెంబేలెత్తిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ ప్రారంభమయిందని కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement