ఒక్క సంతకంతో ఏకంగా 125మంది కానిస్టేబుళ్లకి హెడ్ కానిస్టేబుళ్స్ గా పదోన్నతి కల్పించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. కానిస్టేబుళ్ల పదోన్నతిపై ఆయన ట్వీట్ చేస్తూ.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు. పోలీసు శాఖలో నిజాయతీగా పనిచేసే వారికి పదోన్నతులు తప్పనిసరిగా లభిస్తాయని, అందుకు ఈ పదోన్నతులే నిదర్శనమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. స్టీఫెన్ రవీంద్ర ట్వీట్‌ను మెచ్చుకుంటూ పలువురు ప్రముఖులు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడుతున్నారు.
125మంది కానిస్టేబుళ్లకి పదోన్నతి – ఇది ఆరంభం మాత్రమే – కమిషనర్ స్టీఫెన్
Advertisement
తాజా వార్తలు
Advertisement