అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, నగర సీపీ సీవీ ఆనంద్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, వందలాది మంది యువతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద ఆందోళనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 80 మంది మహిళా ఎస్సైలు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నెల 8న మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ ఎస్‌హెచ్‌ఓ నియమిస్తామని వెల్లడించారు. రానున్న రోజుల్లో మహిళ ఎస్‌హెచ్‌ఓలను నియమిస్తామన్నారు. ఎన్‌సీఅర్‌బీ డేటా ప్రకారం మహిళలు నివసించేందుకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement