– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చెందిన జగ్బీర్ కోరికి పెళ్లయ్యింది. 12 ఏళ్ల క్రితం తాను పూజ అకా హసీనా అనే అమ్మాయిని రైల్వే స్టేషన్‌లో చూశాడు. ఆమె నిస్సహాయురాలుగా ఉండడంతో ఆమెపై సాఫ్ట్ కార్నర్ ఉండేది. దీని తరువాత జగ్బీర్, అతని కుటుంబంతో మాట్లాడి ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కొంతకాలం తర్వాత అతను కోర్టులో పూజ (అకా హసీనా)ని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే కథ ఇక్కడిదాకా బాగానే ఉంది.. కానీ, ఈ మధ్య జగ్బీర్ భార్య ఇస్లామిక్ ఆచారం ప్రకారం తన కొడుక్కు సున్తీ చేయించింది. జగ్బీర్ అభ్యంతరం చెప్పడంతో అతడిని చంపేస్తానని బెదిరించింది.
కాగా, ముస్లిం మతానికి చెందిన హసీనా బానోగా మారిన తన భార్య పూజ తనను ఇస్లాం మతంలోకి మారాలని బలవంతం చేసిందని, అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులు తన తల నరికివేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని జగ్బీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన అయోధ్యలోని షానవాజ్‌పూర్ ప్రాంతంలో ‘లవ్ జిహాద్’గా కనిపిస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇక.. జగ్బీర్ తన భార్య మతపరమైన రిలేషన్ గురించి తెలిసిన తర్వాత ఇదంతా స్టార్ట్ అయ్యింది. హసీనా బానో కొన్నేళ్ల క్రితం పిల్లలకు ఇస్లామిక్ స్టడీస్ బోధించేది. జగ్బీర్‌తో పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులకు తన తల్లి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత జగ్బీర్ వారి పిల్లలలో ఒకరికి సున్తీ చేయించినట్లు కనుగొన్నాడు. ఈ విషయం తనకు తెలియగానే నిలదీశాడు.. ఇక తనను కూడా ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, లేకుంటే తల నరికేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని జగ్బీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.