గత సెషన్ లో నిబంధనలు ఉల్లంఘించడంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 12మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సస్పెండ్ చేసింది. ఈ శీతాకాల సమావేశాలు మొత్తం వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అసలేం జరిగిందంటే .. రాజ్యసభ 254వ సెషన్ చివరి రోజు అంటే ఆగస్టు 11న భద్రతా సిబ్బందిపై ప్రవర్తన, ఉద్దేశపూర్వకంగా దాడులు చేశారు. ఈ సభ, సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభ నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన ద్వారా సభ కార్యకలపాలను ఉద్దేశపూర్వకంగా నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తుందని అధికారిక నోటీసుల్లో వివరించారు. ఏ ఏయే పార్టీలకి చెందిన ఎంపీలు సస్పెండ్ అయ్యారో చూద్దాం..
- ఎలమరం కరీం (సీపీఎం)
- ఫూలో దేవి నేతమ్ (కాంగ్రెస్)
- ఛాయా వర్మ (కాంగ్రెస్)
- రిపున్ బోరా (కాంగ్రెస్)
- బినోయ్ విశ్వం (సీపీఐ)
- రాజమణి పటేల్ (కాంగ్రెస్)
- డోలా సేన్ (టీఎంసీ)
- శాంత ఛెత్రి (టీఎంసీ)
- సయ్యద్ నాసిర్ హుస్సేన్ (కాంగ్రెస్)
- ప్రియాంక చతుర్వేది (శివసేన)
- అనిల్ దేశాయ్ (శివసేన)
- అఖిలేష్ ప్రసాద్ సింగ్ (కాంగ్రెస్) సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.