మరోసారి మెక్సికోలో కాల్పుల ఘటన జరిగింది.ఓ బార్ లో ఆదివారం ఓ సాయుధుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. గ్వానాజువాటోలోని ఇరాపుయాటోలోని బార్లో కాల్పులు జరిగాయని, ఘటనలో ముగ్గురు గాయపడ్డన్నట్లు పేర్కొన్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా మెక్సికోలో తుపాకీ దాడులు పెరుగుతున్నాయి. గత నెల రోజుల్లో ఇలాంటి ఘటన జరుగడం ఇది రెండోది.
Advertisement
తాజా వార్తలు
Advertisement