Friday, November 22, 2024

ప్ర‌మాదంలో భారత్ లోని 12తీర ప్రాంతాలు..క‌నుమ‌రుగు కానున్నాయా..!

మ‌నుషులు చేసే త‌ప్పిదాలే మాన‌వాళి మ‌నుగ‌డ‌కు ముప్పుగా మారుతోంది. అడ‌వులు న‌రికివేత‌, పెరుగుతోన్న కాలుష్యం ఇలా ప‌లు కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు. అందుకే సునామీలు,భూకంపాలు, ప్ర‌కృతి వైప‌రిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇంత‌టితో ఈ ముప్పు త‌ప్ప‌లే లేదు..రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించాల్సిందేన‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల‌లో వెల్ల‌డ‌య్యాయి. విస్తుగొలిపే నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. మ‌రి ఆ సంగ‌తులు ఏంటో చూద్దాం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్ క్లైమేట్‌ ఛేంజ్‌ (ఐపీసీసీ)ని ఉపయోగించి ప్రపంచంలోని సముద్రాల్లో మార్పులను విశ్లేషించగా నమ్మలేని విషయాలు బయటపడ్డాయి.

రోజు రోజుకి సముద్రమట్టం పెరగడం వల్ల భారత్‌లోని 12 తీర ప్రాంతాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదముందట‌.
ఐపీసీసీ నివేదిక ప్రకారం.. ప్రస్తుత వాతావరణ మార్పులు, సముద్రమట్టం పెరుగుదల ఇలాగే కొనసాగితే.. ఈ శతాబ్దం చివరి నాటికి దేశ వాణిజ్య రాజధాని ముంబయి (మహారాష్ట్ర) 1.90 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతుందట. చెన్నై(తమిళనాడు) 1.87 అడుగులు, బావునగర్‌ (గుజరాత్‌) 2.70 అడుగులు, మంగళూరు (కర్ణాటక) 1.87 అడుగులు, ముర్ముగావ్‌ (గోవా) 2.06 అడుగులు, ట్యూటికోరిన్‌ (తమిళనాడు) 1.90 అడుగులు, కిదిర్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) 0.49 అడుగులు, పారాదీప్‌ (ఒడిశా) 1.93 అడుగులు, ఒకా (గుజరాత్‌) 1.96 అడుగులు, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌) 1.77 అడుగులు, కండ్లా (గుజరాత్‌) 1.87 అడుగులు మేర సముద్రంలో మునిగిపోతాయని అంచనా వేశారు.

మ‌రి ఇప్పటికైనా పర్యావరణాన్ని రక్షించుకోవాలని ఐపీసీసీ సూచిస్తోంది. ప్ర‌జ‌లు త‌మ‌ని తాము ర‌క్షించుకోవ‌డానికైనా ప్ర‌కృతిని కాపాడ‌వ‌ల‌సిన పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. రానున్న రోజులు తీవ్ర‌రూపం దాల్చ‌క‌ముందే జ‌నం మేల్కొనాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయి. అందుకే విరివిగా మొక్క‌లు నాట‌డం, అడ‌వుల‌ను కాపాడ‌టం, నీటిని కూడా వృద్ధా చేయ‌కుండా ఉండ‌టం మ‌న‌ధ‌ర్మంగా మ‌నం ఆచ‌రించాల్సిన ప‌నుల‌ని రానున్న రోజులు తెలియ‌జేస్తున్నాయి. వెహిక‌ల్స్ కార‌ణంగా వెలువ‌డుతోన్న వాయు కాలుష్యాన్ని కూడా భారీగా త‌గ్గించాల్సి ఉంది. మ‌రి శాస్త్ర వేత్త‌లు ప్ర‌క‌టించిన రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెరుస్తాయేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement