ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 పోస్టులకు మాత్రం ఈ ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్ష రద్దుకు సంబంధించిన జీవోలు 39, 150ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పింది.
గ్రూప్-1 ఇంటర్వ్యూల స్థానంలో వేరే విధానం అమలుకు చర్యలు చేపట్టనున్నామని, కొత్త నోటిఫికేషన్లు ఆగస్టులో విడుదలకానున్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. 1,184 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామంది. ఏపీపీఎస్సీలో ఆగస్టు నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయంది. ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఏపీపీఎస్సీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
ఈ వార్త కూడా చదవండి: వైసీపీ ఫ్యాన్ గుర్తుకు యువత ఉరేసుకుంటోంది: జేసీ