జూన్ 10వ తేదీన ఇంటి వెనుక ఉన్న బోరు బావిలో పడ్డాడు 11ఏళ్ల బాలుడు. కాగా నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో ఆ బాలుడు బోరు బావినుండి బయట పడ్డాడు. ఈ సంఘటన ఛత్తీస్ ఘడ్ మల్కరోడా డెవలప్మెంట్ బ్లాక్ లో ఉన్న పిహిరిద్ గ్రామంలో చోటు చేసుకుంది.బోరుబావిలో పడిన 11 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు దాదాపు 104 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చెవిటి, మూగ సమస్యలు ఉన్న చిన్నారి రాహుల్ సాహూ 80 ఫీట్ల లోతు ఉన్న బోర్‌వెల్‌లో పడ్డాడు. బాలుడు సుమారు 60 ఫీట్ల లోతులో చిక్కుకుపోయాడు. రాహుల్‌ను రక్షించేందుకు సుమారు 500 మంది ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసు దళాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.చత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగల్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. బాలుడిని కాపాడిన రెస్క్యూ బృందానికి థ్యాంక్స్ చెప్పారు. చిన్నారి రాహుల్ త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement