ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి నేత 87 ఏళ్ల లేటు వయసులో పదో తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతలా. ఓం ప్రకాశ్ చౌతలా ఇవాళ (మంగళవారం) పదో తరగతి, 12వ తరగతి పరీక్షల మార్కుల మెమో అందుకున్నారు. కాగా, సిర్సాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇంగ్లిష్ ఎగ్జామ్ రాసిన ఆయన.. చేతికి ఫ్రాక్చర్ అయినందున ఓ రైటర్ సాయంతో పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది.
హరియాణాలో సంచలనం సృష్టించిన జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో 2013లో ఆయనకు సీబీఐ కేసు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు రాశారు చౌతాలా. కానీ, అప్పుడు ఇంగ్లిష్ పరీక్ష రాయలేదు. ఆ తర్వాత ఓపెన్‌లో భివాని ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు వచ్చాయి. కానీ, చౌతాలా ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యలోనే BSEH ఓంప్రకాశ్ చౌతలాకు ఇంగ్లిష్ కంపార్ట్‌మెంట్ పరీక్ష నిర్వహించింది. తన చేతికి ఫ్రాక్ఛర్ అయినందున రైటర్‌తో రాయించేందుకు అనుమతించాలని కోరి అందులో పాస్ అయ్యారు. కాగా ఇవ్వాల ఆయనకు 10వ తరగతి, 12వ తరగతి మార్కుల మెమోలను అందించారుహర్యానా ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు.