Friday, November 22, 2024

రూ.10నాణేల‌తో కారు కొన్న – త‌మిళ‌నాడు వ్య‌క్తి

రూ.10నాణేల‌తో కారు కొన్నాడు త‌మిళ‌నాడుకి చెందిన వెట్రివేల్. దీనికోసం దాదాపు నెల రోజుల పాటు రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాడు. వాటిని తీసుకుని కారు షోరూంకు వెళ్లాడు. అది చూసిన షోరూం వాళ్లు మొదట ఆశ్చర్యపోయారు. కానీ, ఆ తరువాత వెట్రివేల్ గట్టి సంకల్పానికి వారు దీని ఒప్పందానికి అంగీకరించారు. ప్రభుత్వం చెల్లుతాయని చెప్పినా రూ.10 నాణేలను ప్రజలు తీసుకోకపోవడంతో విసుగు చెందిన ఓ వ్యక్తి కేవలం ప‌ది రూపాయ‌ల‌ నాణేలతో కారు కొనాలని నిర్ణయించుకున్నాడు. ధర్మపురిలోని ప్రముఖ వాహన డీలర్లకు ఈ విచిత్ర అనుభవం ఎదురయ్యింది. ఓ వ్యక్తి కారు కొనుక్కోవడానికి వాహనం నిండా రూ.10 నాణేలతో షోరూమ్‌కి రావడంతో అక్కడి ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు.

అరూర్‌కు చెందిన వెట్రివేల్ దీని గురించి చెబుతూ.. తన తల్లి దుకాణం నడుపుతుంటుందని, ఈ క్రమంలో ఆమె దగ్గరికి రూ. 10 నాణేలు వస్తుంటాయని, చిల్లర ఇచ్చే క్రమంలో అవి ఇస్తే కస్టమర్లు తీసుకోవడానికి నిరాకరించడంతో.. ఆ పదిరూపాయల నాణాలు ఇంటినిండా పెద్ద మొత్తంలో పేరుకుపోయాన‌ని చెప్పాడు. అంతేకాదు 10 రూపాయల నాణేలు విలువ లేనివిగా పిల్లలు ఆడుకోవడం చూసి మనసు కలుక్కుమందని.. చెప్పాడు. ఈ సమయంలోనే అతని మనసులో ఓ ఆలోచన మెదిలింది కేవలం రూ.10 నాణేలతో కారు కొనుక్కోవడం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాడు. వెట్రివేల్ కారు కొనుగోలు కోసం దాదాపు నెల రోజుల పాటు రూ.6 లక్షల విలువైన రూ.10 నాణేలను సేకరించాడు. ఇక కారు డీలర్లు మొదట దీనికి ఒప్పుకోలేదు. అయితే వెట్రివేల్ సంకల్పాన్ని పరిగణనలోకి తీసుకుని, అతని వాదనలోని నిజాయితీని గమనించ వారు ఒప్పందానికి అంగీకరించారు.ఈ నాణాలు చెల్లవని ఆర్బీఐ ఏమీ ప్రకటించలేదు. కానీ పదిరూపాయల నాణాల చెలామణి మీద అప్రకటిత నిషేధం ఉంది. బ్యాంకులు కూడా తీసుకోవడం లేదు. దీనిమీద ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు..అందుకే అది తప్పు అని రుజువు చేయడానికే ఇలా చేశాను అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెట్రివేల్ తెలిపారు.
తాను సేకరించిన రూ.6లక్షల విలువైన పది రూపాయల నాణాల మూటలను వెట్రివేల్ ఓ బండిలో వేసుకుని వచ్చాడు. వాటిని షోరూంలో అక్కడి వారిముందే తన బంధువులతో కలిసి లెక్కించి.. ఇచ్చాడు. వారు అతనికి కొత్త కారు తాళాలు ఇచ్చారు. అతను తన సంకల్పం నెరవేరింది. కొత్త కారు ఇంటికి చేరింది. అందుకే దేనికైనా సంక‌ల్పం గొప్ప‌దంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement