Friday, November 22, 2024

Breaking: ఒవైసీ ఆరోగ్యంగా ఉండాలని.. 101 మేకలను బలిచ్చిన అభిమాని..

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఎటువంటి ఆపద కలగకుండా ఉండాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన ఓ అభిమాని 101 మేకలను బలి ఇచ్చాడు. బిజినెస్ మన్ అయిన తను.. ఆదివారం హైదరాబాద్లోని బాగ్ ఎజహనారా వద్దఈ కార్యక్రమం చేపట్టాడు. కాగా, ఈ కార్యక్రమంలో మలక్​పేట ఎమ్మెల్యే, ఎంఐఎం లీడర్ అహ్మద్ బలాలా కూడా పాల్గొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఎంపీ ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలు ఎట్లాంటి గాయాలు కాకుండ ఒవైసీ బయటపడ్డాడు. ఫిబ్రవరి 3 న దాడి జరిగినప్పటి నుండి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ ఒవైసీ మద్దతుదారులు అతని భద్రతతోపాటు..దీర్ఘాయువు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఈ దాడి తర్వాత అసదుద్దీన్ ఒవైసీకి Z- కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది కానీ, దాన్ని ఒవైసీ తిరస్కరించాడు.

ఒవైసీపై దాడి..
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమం ముగించుకుని ఢిల్లీకి వెళ్తుండగా ఛజర్సీ టోల్ ప్లాజా సమీపంలో ఆయన వాహనంపై కాల్పులు జరిగాయి. కాగా, ఈ ఘటనలో ఎట్లాంటి గాయాలు కాకుండా ఆయన బయటపడ్డాడు. హాపూర్‌లోని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడు సచిన్ పండిట్ పిస్టల్తో ఒవైసీపై కాల్పులు జరిపాడు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సచిన్, శుభమ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement