Tuesday, November 26, 2024

వంద రోజుల్లో ఐదు కొత్త ఎయిర్ పోర్టులు..ఎక్క‌డెక్క‌డో తెలుసా..

కొత్త ఎయిర్ పోర్ట్ ల అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మెట్రో న‌గ‌రాల్లో రెండు ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. హైద‌రాబాద్, ముంబై, ఢిల్లీ తో పాటు బెంగ‌ళూర్ వంటి మెట్రో న‌గ‌రాలలో ఉన్న ఎయిర్ పోర్ట్ లలో ర‌ద్దీ ఎక్కువ ఉంద‌ని వెల్ల‌డించారు.కాగా ఢిల్లీతో పాటు ముంబై న‌గ‌రాలల్లో ఇప్ప‌టికే కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు.

అయితే హైద‌రాబాద్ తో పాటు కోల్ క‌త్త, బెంగ‌ళూర్ వంటి న‌గ‌రాల్లో రెండో ఎయిర్ పోర్టు నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాబోయే 100 రోజుల‌లో 5 కొత్త ఎయిర్ పోర్టులు, 6 హెలీ పోర్టులు, 50 ఉడాన్ రూట్ల‌ను ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్రారంభించ‌డం వీలు కాక పోయిన శంకుస్థాప‌న అయినా.. చేయాల‌ని నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలిపారు. విమాన ప్ర‌యాణాలు చేసే వారి సంఖ్య ఎక్కువ‌వుతుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి వివ‌రిచారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement