తవ్వకాల్లో 10ఏల వేళ్ల త్రిశూలం, 3వేల ఏళ్ల వజ్రాయుధం లభించాయి. బాలి, మలేషియా, జపాన్, చైనా వంటి దేశాల్లో హిందువుల దేవుళ్లను వివిధ పేర్లతో పూజిస్తూ ఉంటారని చెబుతారు. తాజాగా మరో దేశంలో హిందూ దేవుళ్ళ ఆనవాలు తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి. తాజాగా 10 వేల ఏళ్ల నాటి త్రిశూలం, 3 వేల ఏళ్ల కిందటి వజ్రాయుధాన్ని కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ బెంగళూరులోని ప్రెస్ క్లబ్లో ప్రదర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ 2015 మే నెలలో ఫిలిప్పిన్స్ మైనింగ్ తవ్వకాలల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయన్నారు. 2012 నుంచి ఫిలిప్పిన్స్ కాపర్, గోల్డ్ మైనింగ్ల్లో తను భాగస్వామిని అని తెలిపారు. వ్యాపార రీత్యా తన సమయాన్ని ఫిలిప్పిన్స్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటానని, అలాగే అక్కడి పౌరులతో కలిసి పనిచేయడం వల్ల వారితో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయన్నారు.
ఈ క్రమంలో 2015 మే 5న మైనింగ్ సూపర్వైజర్.. తాను మునుపెన్నడూ చూడని వస్తువులు తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు. వాటిని నీటితో శుభ్రం చేయగా అందులో ఒకటి చూడడానికి దేవుడి విగ్రహంలా ఉంది. ఇక రెండోది త్రిశూలంగా గుర్తించామన్నారు. అయితే ఈ రెండూ కూడా హిందు పురాణాలకు సంబంధించిన వస్తువులుగా నిర్థారించినట్లు తెలిపారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటి ఫొటోలను స్నేహితులందరికీ పంపినట్లు తెలిపారు. వాటిపై పరిశోధన కోసం ఇంటర్నెట్ వెతికారట. త్రిశూలంతో పాటు దొరికిన మరో వస్తువు వజ్రాయుధం అని తెలిసిందన్నారు. అది హిందూ పురాణాల్లో ఇంద్ర భగవానుడి ఆయుధం, త్రిశూలం శివుడిది అయ్యుండవచ్చని భావించి తర్వాత భారత్కు వచ్చి పురావస్తు శాఖ వారిని సంప్రదించామని, పురావస్తు శాఖ మాజీ అధికారి అంజనీ మున్షీ వాటిని పురాతన వస్తువులుగా ఆమోదించారన్నారు.