Saturday, November 23, 2024

India | బీజేపీలో చేరిన 100 మంది మాజీ మిలిటెంట్లు.. ప్రధాని మోదీకి సపోర్ట్​ చేయాలన్న పార్టీ లీడర్లు!

అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో  ఇవ్వాల (మంగళవారం) 100 మందికి పైగా మాజీ మిలిటెంట్లు అధికార బీజేపీలో చేరారు. వారు గతంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (NDFB) కేడర్‌లో పనిచేయగా.. వారికి నబిన్ చంద్ర బోడో నాయకత్వం వహించారు. అక్కడి బీజేపీ కార్యాలయంలో కొత్తగా చేరే వారిని స్వాగతిస్తూ, కర్బీ అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ (కెఎఎసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ తులిరామ్ రోంగ్‌హాంగ్ మాట్లాడారు. ఈ రోజు మొత్తం 110 మంది ఎన్‌డీఎఫ్‌బీ మాజీ సభ్యులు తమ పార్టీలో చేరారని, వారు వివిధ ప్రాంతాలకు చెందినవారుగా తెలిపారు. వీరంతా ఇంతకుముందు తీవ్రవాద సంస్థలో వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్నట్టు చెప్పారు.

ఇది కర్బీ అంగ్లాంగ్‌లోనే కాకుండా పొరుగున ఉన్న వెస్ట్ కర్బీ అంగ్లాంగ్, డిమా హసావో జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా రోంగ్​హాంగ్​ అన్నారు. ఈ మూడు జిల్లాలకు లోక్‌సభలో ఒక ఎంపీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీకి చెందిన హోరెన్సింగ్ బే ఇక్కడ ఎంపీగా ఉన్నాడు. 

కాగా, ఇవ్వాల బీజేపీలో చేరిన సభ్యులు పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి విజయం సాధించేలా కృషి చేస్తారని రోంగ్‌హాంగ్ అన్నారు. బే, డిఫు ఎమ్మెల్యే బిద్యాయిస్ంగ్ ఇంగ్లెంగ్, ఇతర KAAC సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement