Wednesday, November 20, 2024

100 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇంటింటికీ టిడిపి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్ర విభజన అనం తరం ఆంధ్ర పార్టీగా ముద్రవేసుకుని తెలంగాణ నుంచి దూరమైన తెలుగుదేశం పార్టీ క్రమేణ విస్తరి స్తుంది. రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా ఒ్కకటే కలిసి అభివృద్ధి సాధిద్దాం నినాదంతో ప్రజలమద్దతు పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేరకు ఫలిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో 15 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ ఓట్లు క్రమేణ టీఆర్‌ఎస్‌ కు బదిలీ అయ్యాయి. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మిగలడంతో విడిపోయినా తెలుగువారిగా కలిసి ఉందాం అంటూ ప్రజల్లోకి పార్టీ వెళ్లింది. తెలంగాణ సెంటి మెంట్‌ తో టీఆర్‌ఎస్‌ కొల్ల గొట్టిన ఓట్లు తిరిగి సంపాధించేందుకు పార్టీఅధినేత చంద్రబాబునాయిడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ చేసిన రాజకీయ వ్యూహం క్రమేణ ఫలిస్తుంది. నాయకత్వంకొరతతో తొలుత 7 నియోజకవర్గాల్లో ప్రారంభమైన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రస్తుతం 100 నియోజకవర్గాల్లో విస్తరించడం శుభసూచకంగా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ భావిస్తూ ఎక్కడికక్కడ పార్టీ నాయకులతో సమా వేశాలు ఏర్పాటుచేస్తూ పార్టీశ్రేణులను ప్రోత్సహిస్తు న్నారు. హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి ప్రతినిధులు పాల్గొన డంతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ప్రోత్సా హంతో త్వరలో బస్సుయాత్రలు చేపట్టేందు కు కార్య క్రమాలను రూపొందిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు చేస్తూ ఎక్కడి కక్కడ కమిటీలను నియమిస్తూ ముందుకు వెళ్లాలనే రాజకీయ ఎత్తు గడతో పార్టీ ముందుకు వెళ్లుతుంది. కరీంనగర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు తొలివిడత బస్సు యాత్ర నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రాభల్యం ఉన్న ప్రాం తంలో టీఆర్‌ఎస్‌,బీజేపీకి ప్రత్యామ్య్నాయం గా ప్రజలు టీడీపీని కోరుటుంటున్నారని పార్టీ ఆంత రంగిక సర్వేలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర కరీంనగర్‌ నుంచి సింగరేణీ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్‌ వరకు నిర్వహించి ఉత్తర తెలం గాణలో పార్టీ ఊపు తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement